గాంధీ చూపిన బాటలో నడవాలి

ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): మహాత్మా గాంధీ చూపిన అహింసా మార్గం లో మనం ప్రతి ఒక్కరం నడవాలని తెలంగాణ వైద్య ఆరోగ్య ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు బండారి కృష్ణ, ప్రధాన కార్యదర్శి సిడం వామన్ అన్నారు. సంఘం ఆధ్వర్యంలో  మహాత్మా గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు  మాట్లాడుతూ గాంధీ చూపిన మార్గం లోనే ప్రతి ఒక్కరూ నడవాలని అన్నారు ఈ కార్యక్రమంలో కోశాధికారి అనిల్, వర్కింగ్ ప్రెసిడెంట్ రమణాచారి, సంఘ సభ్యులు శ్రీనివాస్, రమేష్, నాగభూషణం, జాకీ తదితరులు పాల్గొన్నారు