పిల్లలకు అల్బెన్దోజ్ల్ టాబ్లెట్స్ తప్పక ఇవ్వాలి

వరంగల్ (ఆరోగ్యజ్యోతి) అక్టోబర్ 01 :-  చింతల్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో  నేషనల్ డే వర్మింగ్ డే (N.D.D .) సమావేశాన్ని మెడికల్ ఆఫీసర్ డాక్టర్. ఎస్. రవీందర్ నిర్వహించారు. 0-19 సంవత్సరాల పిల్లలకు అల్బెన్దోజ్ల్ టాబ్లెట్స్ ఇంటి ఇంటి వెళ్లి మందులు ఇవ్వాలని అయన సిబ్బందికి సూచించారు . ఈ కార్యక్రమం  అక్టోబర్ 5 నుంచి 12 అక్టోబర్ వరకు 7 రోజులు కొనసాగుతుంది అయన  తెలిపినారు .ఆశ వర్కర్స్ ఎ.ఎన్.ఎం , టీచర్స్ కు శిక్షణ ఇవ్వడం జరిగిందని అయన పేర్కొన్నారు . ఈ శిక్షణ కార్యకరమంలో  మలేరియా సూపర్వైజర్ తేజావత్ రవీందర్ , సీ. ఓ. డీ. మోహన్ రావు , మెడికల్ ఆఫీసర్ అసిస్టెంట్ రామ రాజేష్ ఖన్నా , ఏ.ఎన్.ఎమ్.లు ఆశ వర్కర్లు,టీచర్స్ లు తదితరులు పాల్గొన్నారు.