హైదరాబాద్,(ఆరోగ్యజ్యోతి); ఆదిలాబాద్ రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్), ఆసుపత్రి లో పనిచేస్తున్న నర్సులకు అధికారులు నెలనెలా వేతనాలు చెల్లించాలని తెలంగాణ మెడికల్ అండ్ పబ్లిక్ హెల్త్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కర్నాటి సాయిరెడ్డి ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెలనెలా వేతనాలు అందకపోవడంతో నర్సులు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు నెల నెల వేతనం ఇచ్చినట్లయితే వారి అవసరాలకు ఉపయోగపడతాయని తెలిపారు. కరోన పరిస్థితుల్లో కూడా ఎంతో శ్రమించి విధులు నిర్వహించిన వారికి ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం విడ్డూరంగా ఉందన్నారు.మూడు నాలుగు రోజుల్లో వేతనాలు చెల్లించాలని లేనిపక్షంలో వైద్య ఆరోగ్య శాఖా మంత్రి, డిఎంఇ ల దృష్టికి తీసుకెళ్తానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.