ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి); ఇచ్చోడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కోకస్ మన్నూర్ లో రెండవ ఏఎన్ఎం గా పనిచేస్తున్న అహల్యా దేవి కి జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగిందని ఈ ప్రమాదంలో ఆమె తీవ్ర గాయాలయ్యాయని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని తెలంగాణ మెడికల్ హెల్త్ ఎంప్లాయిస్ సెకండ్ ఎ ఎన్ ఎం అసోసియేషన్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నాయకులు విజయలక్ష్మి ప్రభుత్వాన్ని కోరారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విధులు నిర్వహించే సమయంలో 44వ జాతీయ రహదారి పై ప్రమాదం సంభవించిందని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. గత వారం రోజుల నుండి రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుందనీ ఈ సమయంలో పూర్తి వేతనం చెల్లించాలని ఈ సందర్భంగా ఆమె అధికారులను కోరారు.