- స్టాప్ నర్సులు చేస్తున్న ధర్నా 7వ రోజుకు చేరింది
ఆదిలాబాద్(ఆరోగ్యజ్యోతి) : స్టాప్ నర్సులకు తక్షణమే వేతనాలు చెల్లించాలని ,ఏడు రోజులుగా రిమ్స్ ఆస్పత్రి ఎదుట సమ్మె చేపడుతున్న ఇప్పటికీ ఒక్క అధికారి కూడా ఇంతవరకు స్పందించలేదని రాష్ట్ర కార్యదర్శి సిర్ర దేవేందర్, స్టాప్ నర్సులు K రాజ్యాలక్ష్మి C చంద్రకళ అన్నారు. ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రి మెన్ గెట్ ముందు ఎఐటియుసి తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ & ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో వేతనాలకోసం స్టాప్ నర్సులు చేస్తున్న ధర్నా 7వ రోజుకు చేరింది . సోమవారం నాడుస్టాప్ నర్సులు మోకాళ్ళపై కూర్చొని నిరసన తెలియచేసినారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ 2018 లో 300 OCS నిబంధనల ప్రకారం రిక్రూట్ మెంట్ ఐన స్టాప్ నర్సులకు 7.నెలల పెండింగ్ వేతనాలు తక్షణమే చెల్లించాలని సమ్మె చేపట్టడం జరిగిందన్నారు. ప్రభుత్వం 544 జీవో లో నియమితులైన ఆదిలాబాద్ రిమ్స్ స్టాఫ్ నర్స్ ఉన్న ఇబ్బందుల గురించి వేతనాల గురించి ఎందుకు పట్టించుకోవడం లేదని ఈ సందర్భంగా అయన ప్రశ్నించారు.కార్యక్రమంలో స్టాప్ నర్సులు బి పెర్సి, జి కవిత, యం శోభారాణి, ఎస్ జోష్న,కే శాంత, ఎస్ శ్రీలత,డి బేబీ, ఎన్ కమలాబాయి, వాగ్మరే సారిక, డి పద్మావతి, ఎ సునీత, సిహెచ్ వనజ ,కోడూరి వనజ,పి ప్రశాంతి, మీర్జా సన, దుర్వా సునీత, కె కరుణ, బి వసంత రాణి, జే జయ, వి పుష్పలత, ఆడే స్వప్న, బి సవిత, కె సురేఖ, పి సుచరిత, కె కృష్ణకుమారి, జి భాగ్యలక్ష్మి, యం అరుణ,డి రాజేశ్వరి,కే రాజ్యలక్ష్మి,డి పుష్పాల, సి చంద్రకళ, సిహెచ్ ప్రియాంక . జాడి సునీత, యం వెంకటలక్ష్మి,ఎహ్ లావణ్య, జి అనురాధ, కె.విజయలక్ష్మి ,యు శ్రీలత,జే రాధా, జి విశాల, కే వసుంధర, జి త్రిచరణ, కే సురేఖ, ఆర్ వినోద,ఏ సుమలత, ఎ విజయ, జి మీనాక్షి, పి సునీత, వి సంగీత తదితరులు పాల్గొన్నారు.