కరోన టెస్టుల నుంచి ఫీల్డ్ సిబ్బందిని మినహాయించాలి

 


ఖమ్మం (ఆరోగ్యజ్యోతి): వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ ఫిల్డ్ స్టాఫ్, ఎఎన్ఎం లు కరోనా పరీక్షలు చేయాలని ఆదేశించడం సరైన విధానం కాదని కోవిడ్ పరీక్ష లు  చేయించాలనే నిర్ణయం విరమిచాలని మినహాయించాలని తెలంగాణ వైద్య ప్రజా ఆరోగ్య ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు రాజశేఖర్ అన్నారు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం ఎదుట ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ఇప్పటికే ఎఎన్ఎం, ఫిల్డ్ స్టాఫ్ ఫిల్డ్ స్టాఫ్ కు పనిభారం  ఎక్కువగా ఉందిని, వైద్య ఆరోగ్య శాఖ లో అన్ని పనులు ఫిల్డ్ స్టాఫ్ ఎఎన్ఎం లు చేయడంతో పనిభారం పెరుగుతుందన్నారు. మత శిశువు సంక్షేమం,గర్భిణి ల పరీక్షలు, HB శాతం,బీపీ,షుగర్ చూడండం,TT లు వేయడం,సుఖ ప్రసవం కోసం జాగ్రత్తలు చెప్పడం,డెలివరీ సమయంలో ఇబ్బందులు ఉంటే హాస్పిటల్స్ కు రెపరల్ చేయడం,పుట్టిన బిడ్డకు వ్యాది నిరోధక టీకాలు ఇవ్వడం, కేసీఆర్ కిట్ ఇప్పించడం,TB బాధితులకు, కుష్ఠు వ్యాధి గ్రస్థులకు మందులు పంపిణీ చేయడం,సబ్ సెంటర్ స్తాయిలో సమావేశం ఏర్పాటు చేయడం, జాతీయ స్థాయి ,రాష్ట్ర స్థాయి ప్రోగ్రాం లో విటమిన్లు, పుష్టికా హారం, జనాభా నియంత్రణ, లాంటి కార్యక్రమంలో పాల్గొనడం,గ్రామంలో జరిగే జనన,మరణాలను నమోదు చేయాలి, పాఠశాలలను,సందర్శించడం,గర్భిణిని ఇంటికి సందర్శించడం లాంటి అనేక పనులతో  సతమతమవుతున్నారని అయన అన్నారు., ,ప్రతి బుధ,శని వారం నాడు PHC లకు వెళ్లి Vaccine తెచ్చుకోవాలి,vaccine రవాణా భత్యం కు బడ్జెట్ రాకపోవడం తో జీతం నుండే భరించాలని తెలిపినారు. ఈ కార్యక్రమంలో లో జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణారావు ఉమెన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ధన లక్ష్మి,సిబ్బంది లు, ఆశకర్యకర్తలు పాల్గొన్నారు.