టిబి కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఇన్చార్జి డిఎంఅండ్హెచ్ఓ

ఆదిలాబాద్, (ఆరోగ్యజ్యోతి): జిల్లా క్షయ నివారణ కార్యాలయాన్ని మంగళవారం నాడు ఇన్చార్జి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సాధన ఆకస్మికంగా తనిఖీ చేశారు.పలు రికార్డ్లను పరిశీలించారు.అనంతరం సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం గా ఆమె మాట్లాడుతూ  వ్యాధిగ్రస్తులకు చికిత్స లు అందించడంతో పాటు అవసరమైతే పరీక్షలు నిర్వహించాలని సూచించారు .రోగులకు మందులు సరైన రీతిలో అందించి అన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ సాయి ప్రియ,బి కృష్ణ, చెన్న మల్లయ్య, నాగభూషణం, నవిద్  మోసిన్ , రమేష్ తదితరులు పాల్గొన్నారు.