కర్నూలు(ఆరోగ్యజ్యోతి):104 అక్టోబర్ 31,2019 న ఇచ్చిన హామీలను అమలు చేయాలని, అలాగే జీవో నెం:27 ప్రకారం వేతనాలు ఇవ్వాలని, కలెక్టరేట్ వద్ద 104 ఉద్యోగులు చేసిన ధర్నా కార్యక్రమన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 104సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి యాకోబు మాట్లాడుతూ సీఎం ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని అన్నారు. జూలై నెల నుంచి నాలుగు నెలలుగా ఉన్న పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని అయన డిమాండ్ చేసినారు. డ్యూటీలు లేని 23 మందికి డ్యూటీ లు ఇవ్వాలని, జిల్లాలోని ఉద్యోగులందరికీ వైద్య ఆరోగ్య శాఖ ఉద్దోగులకు ఇచ్చిన ఇనిస్టెంట్ ఆర్డర్ 76 ను తక్షణమే 104 ఉద్దోగులకు కూడా అమలు చేయాలని డిమాండ్ చేశారు, లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యోగులైన నూర్ భాషా, చంద్రశేఖర్, జమాల్ బాషా, సత్యవతి, బాల గంగాధర్ రెడ్డి, మేరీ, గోవిందమ్మ ,ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.