లింగ నిర్ధారణ చేస్తే చర్యలు

నిర్మల్‌ (ఆరోగ్యజ్యోతి)‌: ప్రభుత్వ, ప్రైవేట్‌ దవాఖానకు వచ్చే గర్భిణులకు లింగనిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామ ని అదనపు కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడే దవాఖానల నిర్వాహకులను ఆదేశించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్యులతో నిర్వహించిన సమావేశంలో మా ట్లాడారు. జిల్లాలో జనన రేటును పెంచేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లా వైద్యాధికారి వసంత్‌ రావు ప్రభుత్వ, ప్రైవేట్‌ దవాఖానల వైద్యులు పాల్గొన్నారు.