అమరావతి(ఆరోగ్యజ్యోతి) : ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ మహమ్మారి ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో ఆ రాష్ట్రంలో కొత్తగా 2,410 కొవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 2,452 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. 11 మంది ప్రాణాలు కోల్పోయారు.రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,38,363 చేరింది. 8,09,770 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇవాళ్టి వరకు తీవ్రమైన ఇన్‌ఫెక్షన్ల కారణంగా 6768 మంది మృత్యువాతపడ్డారు. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో 79,601 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఇప్పటి వరకు 85,07,230 శాపింళ్లను పరీక్షించినట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.