ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల‌ ప్రవేశాలకు నోటిఫికేషన్




నవంబర్ 1నుంచి 8 వ‌ర‌కు  ల‌న్‌లైన్‌లో దరఖాస్తులు


వెల్లడించిన కాళోజి ఆరోగ్య విశ్వా విద్యాలయం








వ‌రంగ‌ల్(ఆరోగ్యజ్యోతి) : రాష్ర్టంలో దంత వైద్య ప్రవేశాల ప్ర‌క్రియ ప్రారంభం అయ్యింది. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల ప్రవేశాలకు గాను ఆన్‌లైన్  దరఖాస్తుల నమోదుకు కాళోజి నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నేడు  నోటిఫికేషన్ విడుదల చేసింది.  జాతీయ స్థాయి అర్హత పరీక్ష నీట్ 2020లో అర్హత సాధించిన అభ్యర్థులు  నమోదు చేసుకోవాలని తెలిపారు. కరోనా వైరస్ దృష్ట్యా ఒరిజినల్ ధ్రువపత్రాల పరిశీలిన   పీజీ తరహాలోనే యుజి ప్రవేశాలకు చేపట్టనున్నారు.