న్యూఢిల్లీ(ఆరోగ్యజ్యోతి): దేశంలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గత పది రోజులుగా 40 నుంచి 50 వేల మధ్య నమోదవుతూ వస్తున్నాయి. గత శనివారం 50 వేలపైచిలుకు కేసులు నమోదవగా, నిన్న 45 వేల కేసులు రికార్డయ్యాది. నిన్నటికంటే 0.5 శాతం ఎక్కువగా సుమారు 46 వేల పాజిటివ్ కేసులు వచ్చాయి. దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 45,903 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 85,53,657కు చేరింది. ఇందులో 5,09,673 కేసులు యాక్టివ్‌గా ఉండగా, మరో 79,17,373 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఆదివారం నాటికంటే 2,992 యాక్టివ్ కేసులు తగ్గగా, కొత్తగా 48,405 మంది డిశ్చార్జి అయ్యారు. అదేవిధంగా నిన్న ఉదయం నుంచి ఇప్పటివరకు 490 మంది బాధితులు మరణించారు. దీంతో దేశంలో కరోనా మృతుల సంఖ్య 1,26,611కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ప్రకటించింది.