ఢిల్లీ: దేశంలో కరోనా కేసుల సంఖ్య నేడు కాస్త తగ్గింది. తాజాగా హెల్త్ బులిటెన్‌ను కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 47,638 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 84,11,724కు చేరుకుంది. కాగా.. గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా 670 మంది మృతి చెందినట్టు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటి వరకూ మొత్తంగా 1,24,985 మంది కరోనాతో మృతి చెందారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 5,20,773 యాక్టివ్ కేసులున్నాయి. దేశ వ్యాప్తంగా కరోనా నుంచి 77,65,966 మంది కోలుకున్నారు. దేశంలో కరోనా రికవరీ రేటు 92.32 శాతం ఉండగా.. మరణాల రేటు 1.49 శాతంగా ఉంది.