వైద్య విద్యను పూర్తి చేసిన విద్యార్థులకు బంగారు పథకాలు

హైదరాబాద్, (ఆరోగ్యజ్యోతి): కజకస్తాన్ నేషనల్ యూనివర్సిటీ లో వైద్య విద్యను పూర్తి చేసిన విద్యార్థులకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ ఈటల రాజేందర్ గ బంగారు పథకాలను అందజేశారు.ఈ సందర్భంగా మంత్రి  మాట్లాడుతూమధ్య తరగతికి చెందిన వారిని నియో సంస్థ వైద్యులు గా తీర్చి దిద్దడం అభినందనీయము అన్నారు.దేవుడి తర్వాత వైద్యుడికి ఆ స్థానం ఉంటుందని  ప్రజలకు వైద్యం అందించడంలో ముందు ఉండాలని తెలిపినారు.  వైద్యులు వ్యాపార దృక్పథంతో కాకుండా సేవా దృక్పథంతో వైద్యాన్ని అందించాలలన్నారు. అంతటి ఉపద్రవాన్ని ప్రజల్లో ధైర్యాన్ని నింపి  ఇక్కడి వైద్యులు, వైద్య సిబ్బంది సహాయంతో ఎదుర్కోగలిగాం అన్నారు.  రోగులతో ప్రేమగా మాట్లాడి వారికి ధైర్యం నింపి చికిత్సలు అందించాలి. రోగిని విఐపి గా భావించి వైద్య సేవలు అందించాలి.