జర్నలిస్టు పిల్లలకు ప్రయివేట్ విద్యాసంస్థల్లో 50శాతం ఫీస్ రాయితీ

  ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): కరోనా కష్టకాలంలో వృత్తి పరంగా, ఉద్యోగపరంగా జర్నలిస్టులు ఇబ్బందులు ఎదురుకొంటున్న నేపథ్యంలో 2020-21 విద్యా సంవత్సరానికి గాను జర్నలిస్టు పిల్లలకు ప్రయివేట్ విద్యాసంస్థల్లో 50శాతం ఫీస్ రాయితీ అందించేందుకు జిల్లా విద్యాశాఖ అంగీకరించింది.TUWJ(H-143) జిల్లా నాయకత్వం ఆదిలాబాద్ DEO రవీందర్ రెడ్డిని కలిసి సమస్యను విన్నవించాగ ఈ మేరకు ప్రయివేట్ విద్యాసంస్థల్లో 50శాతం ఫీజు రాయితీ కలిపిస్తు గురువారం సాయంత్రం ఉత్తర్వులు జారీచేశారు.ఉత్తర్వు కాపీని జర్నలిస్టు నాయకులకు DEO అందజేస్తూ 50శాతం ఫీజు రాయితీ తప్పనిసరిగా అమలు చేసేలా చర్యలు తీసుకొంటమని ఈ మేరకు అన్ని విద్యాసంస్థలకు సర్కులర్ జారీ చేస్తామని అన్నారు.ప్రయివేట్ మేనేజ్మెంట్లు జర్నలిస్టులకు పిర్తిగా సహకరించాలని TUWJ(H-143) జిల్లా అధ్యక్షులు బేత రమేష్,ప్రధానకార్యదర్శి లక్ష్మీపురం రాజు కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు అన్వర్, కోశాధికారి శానం ప్రవీణ్,నాయకులు తేజ శంకర్,సంతోష్,DVR ఆంజనేయులు ఉన్నారు.