- పెండింగ్లో ఉన్న నాలుగు వేల మంది ఉద్యోగుల వేతనాలు పెంచండి
- ఆరోగ్యశాఖ మంత్రికి వినతి పత్రం
కరీంనగర్, (ఆరోగ్యజ్యోతి): నేషనల్ హెల్త్ మిషన్ లో పని చేస్తున్న 4 వేల మంది 510 జీవోను సవరించాలని నేషనల్ హెల్త్ మిషన్ కాంట్రాక్ట్ అండ్ ఔట్ సోర్సింగ్ తెలంగాణ మెడికల్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ కో చైర్మన్ రామ రాజేష్ కన్నా హుజురాబాద్ మండలంలోని కమలాపూర్ గ్రామంలో శుక్రవారం నాడు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ను కలిసి వినతిపత్రాన్ని సమర్పించారు .ఈ సందర్భంగా పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు రాష్ట్రవ్యాప్తంగా 510 జీవో ప్రకారం 13 వేల మందిఉద్యోగులు తెలంగాణలో పనిచేస్తున్నారని అందులో తొమ్మిది వేల మంది ఉద్యోగులకు మాత్రమే వేతనం పెంచారని మిగతా నాలుగు వేల మందికి వేతనాలు పెంచలేదని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. వేతనాలు పెంచిన ఇవ్వాలి అయన డిమాండ్ చేసినారు. వివిధ స్థాయిలు స్థాయిలో ఉద్యోగులు పనిచేస్తున్నారని ముఖ్యంగా వైద్య అధికారులు, సీఈవో ,లో అకౌంటెంట్, డాటా ఎంట్రీ ఆపరేటర్, మెడికల్ ఆఫీసర్ అసిస్టెంట్లు, వాచ్మెన్, కెసిఆర్ కిట్ కౌన్సిలర్లు, ఎన్.సి.డీ.కౌన్సిలర్ ఉన్నారని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. మంత్రి స్పందించి వేతనాలు పెరగని సిబ్బందికి వేతనాలు పెంచే విధంగా తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు ఈ వినతి పత్రం కార్యక్రమంలో కాంట్రాక్టు అండ్ ఔట్ సౌర్చింగ్ ఎంప్లాయిస్ తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ సెంట్రల్ యూనియన్ ఈ 1926/ 98 టీఅర్ఎస్ కేవీ మినిస్టర్ జాయింట్ సెక్రటరీ ఏకుల చిరంజీవి , వైస్-ప్రెసిడెంట్ బండి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.