ఇమ్యూనిటీ పవర్ పెంచే జామ

జామ లేదా జామి,మిర్టేసి కుటుంబానికి చెందిన పండ్లు . భారతదేశంలో ఒక సాధారణమైన ఇంట్లో పెరిగే చెట్టు. దీనిని తియ్యని పండ్లకోసం పెంచుతారు. జామ పండ్లలో కొన్ని తెల్లగా ఉంటాయి. కొన్ని ఎర్రగా ఉంటాయి.జామ మొక్కలు మిర్టిల్‌ కుటుంబానికి చెందిన సిడియం కోవకు చెందిన మొక్కలు. శీతోష్ణస్థితి బట్టి 100 వేర్వేరు రకాలుగా లభ్యమవుతున్నాయి. జామపండు ఉపయోగాల గురించి మహ్మద్ కలీముల్లా ఆరోగ్యకార్యకర్త (మగ) పట్టణ మలేరియాపథకం నల్లగొండ, జమ పండు గురించి ఎలా తెలియ చేసినారు. ఇవి మెక్సికో, మధ్య, దక్షిణ అమెరికాలకు జాతీయ మైనవి. జామపండు, 4 సెం.మీ నుండి 12 సెం.మీ పొడవు ఉండి చూడడానికి ఏపిల్‌ పండులాగాని, బేరి పండులాగ గాని ఉంటుంది. లోపలి కండ తెలుపు, ఎరుపు లేదా గులాబీవర్ణం కలిగి తియ్యగా ఉండి కమ్మని వాసనతో దృఢమైన పచ్చని పై తొడుగు కలిగి ఉంటుంది. స్ట్రా బెర్రీ జామ (పి. కాటిల్‌ యానమ్‌) బ్రెజిల్‌ దేశంలో పుట్టి, ఎర్రని పళ్లు కలిగి ఉంటుంది. ఈ పళ్లు పై పొర గరకుగా లోపలి గుజ్జు ఎర్రగా, రుచికి స్ట్రాబెర్రీ లాగ ఉంటాయి. ఈ పండు ఒక విలక్షణమైన సువాసనతో నిమ్మకంటే కొంచెం తక్కువ ఘాటుగా కలిగి ఉంటుంది. జామపండు లోపలి గుజ్జు తియ్యగా లేక పుల్లగా ఉండి తెలుపు నుంచి ముదురు గులాబీ వర్ణం కలిగి ఉంటుంది. లోపలి గింజలు గట్టిగా ఉండి, పండుకూ పండుకు వాటి సంఖ్య మారుతూ ఉంటుంది.


ఆహార విలువ--జామ తినే భాగం 100 గ్రా.లలో


కాలరీలు 36-50 తేమ 77-86 గ్రా పీచు 2.8-5.5. గ్రా ప్రొటీన్స్‌ 0.9-1.0 గ్రా క్రొవ్వు 0.1-0.5 గ్రా యాష్‌ 0.43-0.7 గ్రా కార్బోహైడ్రేట్లు 9.5-10 గ్రా కాల్షియం 9.1-17 గ్రా పాస్ఫరస్‌ 17.8.30 మి.గ్రా ఐరన్‌ 0.30-70 మి.గ్రా కెరోటీన్‌ (విటమన్‌ 'ఏ') 200-400 ఎస్కార్బిక్‌ ఆవ్లుము (విటమిన్‌ 'సి') 200-400 మి.గ్రా. ధియామిన్‌ (విటమిన్‌ బి1) 0.046 మి.గ్రా రిబోప్లేవిన్‌ (విటమిన్‌ బి2) 0.03-0.04 మి.గ్రా నియాసిన్‌ (విటమిన్‌ బి3) 0.6-1.068 మి.గ్రా


పోషక విలువలు


పోషక విలువలు ప్రతి వంద గ్రాములకు నీరు: 81.7 గ్రా: కొవ్వు. 0.3 గ్రా. ప్రోటీన్ 0.9 గ్రా పీచు పదార్తాలు: 5.2 గ్రా. సి.విటమిన్ 212 మి.గ్రా. పాస్పరస్. 28 మి.గ్రా సోడియం 5.5 మి.గ్రా పొటాసియం: 91 మి.గ్రా. కాల్సియం: 10 మి.గ్రా ఇనుము; 0.27 మి.గ్రా. శక్తి: 51 కిలో కాలరిలు


ఉపయోగాలు


            వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది . శక్తివంతమైన యాంటి ఆక్షిడేంట్ గా ఉపయోగపడుతుంది, కణజాలము పొరను రక్షిస్తుంది, కొలెస్టిరాల్ ను తగ్గిస్తుంది,


జామ ఏడాది పొడవునా అడపాదడపా లభిస్తున్నా శీతాకాలం లోనే వీటి రుచి బలే గమ్మత్తుగా ఉంటుంది . ప్రపంచంలో అన్ని దేశాలలోను లభిస్తుంది . . ఆసియా దేశాలలో విసృఉతంగా పండుతుంది . కమలా పండులో కంటే ఇదు రెట్లు అధికంగా విటమిను " సి " ఉంటుంది . ఆకుకూరలలో లభించే పీచు కంటే రెండింతలు పీచు జామకాయలో ఉంటుంది . చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు అవసరమయ్యే " కొల్లాజన్ " ఉత్పత్తికి ఇది కీలకము, కొవ్వు మెటబాలిజాన్ని ప్రభావితం జేసే " పెక్టిన్" జామలో లభిస్తుంది . ఇది కొలెస్ట్రాల్ ను తగ్గించి, పేగుల్లో ప్రోటీన్ పరిశుభ్రతను పరిరక్షించడంలో సహకరిస్తుంది . జామలో కొవ్వు, క్యాలరీలు తక్కువగా ఉంటాయి కావున బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి పండు . జామకాయలో పోషకాలు, విటమిన్లు, పీచు పదార్థం వంటి గుణాల వల్ల చక్కెర వ్యాధిగ్రస్తులు సైతం ఆరగించవచ్చు. నీటిలో కరిగే బి. సి. విటమిన్లు, కొవ్వులో కరిగే విటమిన్ ఎ జామకాయలో ముఖ్యంగా లభించే పోషకాలు. ఇక జామపండు పై చర్మంలో విటమిన్ సి అత్యధికంగా ఉంటుంది.జామకాయలో ఉండే పీచు పదార్థం వల్ల మలబద్ధకం నివారించబడుతుంది. బొప్పాయి, ఆపిల్, నేరేడు పండు కంటే జామకాయలోనే పీచు పదార్థం ఎక్కువగా ఉండటంతో ఇది సుగర్ వ్యాధికి చక్కటి ఔషధం .అలాగే జామ ఆకులను నమలడం వల్ల పంటి నొప్పులు తగ్గడమే కాక ఆకలి కూడా పెరుగుతుంది. పైగా కొన్ని రకాల వ్యాధుల బారిన పడి ఆకలి మందగించిపోయిన వారికి ఇది ఆకలి పుట్టించగలదు.



  • వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఆహారంలో తప్పనిసరిగా చేర్చాల్సిన పండు జామ.

  • జామ పండులో విటమిన్ సి చాలా ఎక్కువ. ఇది చాలా శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్ అందువల్ల వ్యాధి నిరోధకత పెంచడంలో కీలకపాత్ర వహిస్తుంది. ఈ సీజన్లో విరివిగా దొరికే జామపండ్లు కొవిడ్ నుంచి రక్షణ కొరకు కూడా పనిచేస్తాయి. ఇమ్యూనిటీ పెంచడం గుడ్ ఫుడ్ లోనే కాదు.. ఇతర పోషకాలను అందించడంలో కూడా జామ ముందుంటుంది.

  • జామపండు లో విటమిన్ బి6, బి కాలు కూడా పుష్కలం. ఇవి మెదడులోని న్యూరాన్ల పనితీరును మెరుగుపరుస్తాయి. అందువల్ల జామ పండ్లు ఎక్కువగా తినేవారిలో మెదడు చురుగ్గా ఉంటుంది. డిమెన్షియా (మతిమరుపు), అల్జీమర్స్ వంటి జబ్బులను నివారించడా నికి కూడా ఇది తోడ్పడుతుంది.

  • జామలో గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ. అందుకే డయాబెటిస్ ఉన్నవాళ్లు కూడా దీన్ని నిరభ్యం తరంగా తినవచ్చు.

  • పీచు పదార్థాలు దీనిలో చాలా ఎక్కువ. కాబట్టి ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. దాంతో పరోక్షంగా వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాదు ఈ పీచు పదార్థాలు ఒంట్లో చక్కెర నెమ్మదిగా విడుదలయ్యేలా చేస్తాయి. కాబట్టి మధుమేహులకు మేలైన పండు.

  • జామపండ్లను తినేవారిలో దంతాలు, చిగు ళ్లకు సంబంధించిన


వ్యాధులు చాలా తక్కువ. ఇవి ఎక్కు వగా తీసుకునేవాళ్లు వేగంగా బరువు తగ్గు తారు. ఇంకెందుకాలస్యం ఇన్ని సుగుణాలున్న జామ పండ్లను తినండి. ఆరోగ్యంగా ఉండండి.