ప్రణాళిక ప్రకారం కేసులను గుర్తించాలి
వీడియో కాన్ఫరెన్స్లో టి బి జె డి డాక్టర్ బి రాజేశం
ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): క్షయ నివారణ కోసం పనితీరును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తిచి ఆదిలాబాద్ జిల్లా దేశంలోనే మూడో స్థానంలో ఉందని వీడియో కాన్ఫరెన్స్లో అధికారులు తెలిపారు. పనితీరు మరింత మెరుగు పరచి దేశంలోనే మొదటి స్తానంని కి తిసుకవేల్లలని అధికారులు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ సూచించారు. బుధవారం నాడు రాష్ట్ర అధికారులతో జిల్లా క్షయ నివారణ అధికారి కార్యాలయంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. రాష్ట అధికారులు టిబి స్టేట్ ఇంచార్జ్, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ రాజేశం, డాక్టర్ సుమలత, డాక్టర్ మహేష్, డబ్ల్యూహెచ్వో నుండి డాక్టర్ స్నేహ శుక్ల , డాక్టర్ శ్రీ గణ, డాక్టర్ మహేష్, స్టేట్ కోఆర్డినేటర్ డాక్టర్ జమీర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీవీని ఎప్పటికప్పుడు గుర్తించాలని అధికారులు సూచించారు .ల్యాబ్ టెస్ట్ లు ఎప్పటికప్పుడు చేయాలని తెలిపినారు. గుర్తించిన క్షయ రోగులకు ప్రతినెల ఐదు వందల రూపాయల పౌష్టికాహారం కోసం ప్రభుత్వం ఇచ్చే వాటిని వెంటనే అందించె విదంగా చూడాలన్నారు. చికిత్సలు ఎప్పటికప్పుడు చేయాలని క్షయ తో పాటు హెచ్ఐవి ఉన్న వారిని గుర్తించాలని, షుగర్ వ్యాధి గ్రస్తులకు టీవీ పరీక్షలు చేయాలని పరీక్షల కొరకు ప్రత్యేక ప్రణాళికను రూపొందించాలని చర్చించారు. ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ఈ సందర్భంగా వారు తెలిపారు .ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో టిబి సూపర్వైజర్ ను ఏర్పాటు చేయాలని తెలిపారు. జిల్లాలో కొన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వెనుకబడి ఉన్నాయని ఈ సందర్భంగా వారు తెలిపారు వీటిని ముందు తీసుకెళ్ళండి ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీవీ వైద్యాధికారి డాక్టర్ సాయి ప్రియ, జిల్లా కోఆర్డినేటర్ చెన్న మల్లయ్య, రవీందర్ ,నాగభూషణం, నాగరాజు ,నవీన్, తదితరులు పాల్గొన్నారు.