అడ్వైజరీ మెంబర్‌గా తమిళ మూలాలున్న డాక్టర్‌ సెలిన్‌

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత జో బైడెన్‌ కొవిడ్‌ కట్టడికి టాస్క్‌ ఫోర్స్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసింది. ఈ బృందంలో అడ్వైజరీ మెంబర్‌గా తమిళ మూలాలున్న డాక్టర్‌ సెలిన్‌  గౌండర్‌కు అవకాశం దక్కింది. సెలిన్‌ది తమిళనాడులోని ఈరోడ్‌ జిల్లా పెరుమాలపాలెం. తండ్రి రాజ్‌ నటరాజన్‌ 1960లో అమెరికా వెళ్లారు. అక్కడే సెలిన్‌ వైద్యవిద్యను అభ్యసించింది.  ప్రస్తుతం న్యూయార్క్‌ విశ్వవిద్యాలయం అంటువాధ్యుల విభాగంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్నది. హెచ్‌ఐవీ తదితర దీర్ఘకాలిక వ్యాధుల చికిత్సలో ఆమె అనుభవజ్ఞురాలు.  సొంతూరు పెరుమాలపాలేనికి సెలిన్‌ చాలా సార్లు వచ్చారు. బాలికల్లో విద్యను ప్రోత్సహించడానికి  తన తండ్రి పేరు మీద రాజ్‌ గౌండర్‌ ఫౌండేషన్‌ను స్థాపించారు. ‘మా ఊరి బిడ్డ అమెరికాలో విజయాలు సాధించడం గర్వంగా ఉంది’ అంటున్నారు పాలెం గ్రామస్థులు.