హైదరాబాద్(ఆరోగ్యజ్యోతి): స్టాఫ్ నర్సు అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలనను టీఎస్‌పీఎస్‌సీ వాయిదా వేసింది. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, తెలంగాణ వైద్య విద్య విధాన పరిషత్‌లో స్టాఫ్ నర్సుల నియామకానికి 3 నవంబర్,2018న పరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే. మొత్తం 3,311 ఖాళీలకు రాత పరీక్షలో చూపిన మెరిట్ ఆధారంగా 1:2 చొప్పున సర్టిఫికెట్ల పరిశీలనకు పిలిచారు. రేపట్నుంచి ఈ నెల 19 వరకు ఆన్‌లైన్ ద్వారా ధ్రువపత్రాల పరిశీలన జరగాల్సి ఉంది. కాగా సర్వీస్ వెయిటేజీ తప్పుగా ఉందని ఇటీవల స్టాఫ్‌నర్సు అభ్యర్థులు ఆందోళన చేశారు. స్టాఫ్‌నర్సు అభ్యర్థుల వినతిపత్రాలు వైద్యారోగ్యశాఖకు పంపించిన నేపథ్యంలో అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలనను వాయిదా వేసినట్లు టీఎస్‌పీఎస్‌సీ వెల్లడించింది. వైద్యారోగ్యశాఖ వివరణ అందాక అవసరమైతే మెరిట్ జాబితాను సవరించనున్నట్లు పేర్కొంది.