- ఎంఎస్‌ఎన్ ఫౌండేషన్ తరఫున ఏడు అంబులెన్స్‌లు
- నవాబ్‌పేట మండలానికి ఒకటి కేటాయింపు : ఎంపీ మన్నె
నవాబ్‌పేట(ఆరోగ్యజ్యోతి): ప్రజారోగ్యానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం నవాబ్‌పేట మం డలకేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయం వద్ద 108 వాహనాన్ని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డితో కలిసి ఎంపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మన్నె మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ పిలుపుమేరకు గిఫ్ట్ ఏ స్మైల్‌లో భాగంగా ఎంఎస్‌ఎన్ ఫౌండేషన్ అధినేత ఎం.సత్యనారాయణరెడ్డి మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఏ డు అంబులెన్సులు ఇచ్చారన్నారు. అందులో భాగంగానే నవాబ్‌పే ట మండలానికి ఒకటి కేటాయించినట్లు తెలిపారు. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు అంబులెన్స్‌లను వినియోగించుకోవాలన్నారు. అనంతరం నూతనంగా నిర్మిస్తున్న కేజీబీవీ కళాశాల భవనాన్ని వారు పరిశీలించారు. దయ్యపంతుపల్లి గ్రామంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గండు చెన్నయ్యను పరామర్శించారు. కార్యక్రమంలో సంగీత, నాటక అకాడమీ చైర్మన్ బా ద్మి శివకుమార్, ఎంపీపీ అనంతయ్య, జెడ్పీటీసీ రవీందర్‌రెడ్డి, సిం గిల్ విండో చైర్మన్ నర్సింహులు, తాసిల్దార్ రాజేందర్‌రెడ్డి, ఎంపీడీ వో శ్రీలత, మార్కెట్ కమిటీ చైర్మన్ డీన్‌రావు, సర్పంచ్ గోపాల్‌గౌడ్, ఎంపీటీసీ రాధాకృష్ణ, నాయకులు పాల్గొన్నారు.