రోగులకు మెరుగైన వైద్యం అందించాలి


  • నిజామాబాద్‌ జడ్పీ చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌రావు 

  • బోధన్‌ జిల్లా ప్రభుత్వ దవాఖాన తనిఖీ

  • కాయకల్ప అవార్డు పొందినందుకు అభినందన 


బోధన్‌(ఆరోగ్యజ్యోతి:  పట్టణంలోని జిల్లా ప్రభుత్వ దవాఖానను అభివృద్ధి కమిటీ అధ్యక్షుడి గా వ్యవహరిస్తున్న నిజామాబాద్‌ జిల్లా ప రిషత్‌ చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌రావు బు ధవారం తనిఖీ చేశారు.  దవాఖాన సూపరింటెండెంట్‌ డాక్టర్‌ అన్నపూర్ణతో కలిసి అన్ని విభాగాలను సందర్శించారు. జనరల్‌ వార్డులు, ప్రసూ తి వార్డుల్లో రోగుల వద్దకు వెళ్లి వారికి అందుతున్న వైద్యసేవలపై ఆరాతీశారు. వైద్య సేవలను పొంద డంలో ఇబ్బందులేమైనా ఉన్నాయా అం టూ రోగులకు అడిగారు. ఫార్మసీని పరిశీలించి.. మందుల నిల్వలపై వివరాలు  తెలుసుకున్నా రు. వైద్యశాలకు వస్తున్న రోగుల సంఖ్య, కరోనా సమయంలో అందించిన సేవలు, ఇతర వసతుల కల్పనపై మెడికల్‌ సూపరింటెండెంట్‌, వైద్యులతో జడ్పీ చైర్మన్‌ మాట్లాడారు. ఇటీవల ఒక ఆపరేషన్‌ థి యేటర్‌లోని పైకప్పు కూలిన విషయమై వివరాలు అడిగారు. ఆ గదిని పరిశీలించి.. వెంటనే మరమ్మతుల కోసం చర్యలు తీసుకోవాలంటూ సంబంధిత శాఖ ఈఈని సెల్‌ఫోన్‌లో ఆదేశించారు. రికార్డులను పరిశీలించి వైద్యులతో మాట్లాడారు. రోగులకు సకాలంలో సరైన వైద్యం అందించాలని ఆయన సూచించారు. జిల్లా ప్రభుత్వ దవాఖాన అభివృద్ధి కమిటీ చైర్మన్‌గా తాను తొలిసారిగా వచ్చానని, ఇకనుంచి తరచూ  సందర్శిస్తానని చెప్పారు. 


జిల్లా దవాఖానగా అప్‌గ్రేడ్‌ అయినందున, అందుకు తగినట్లుగా వసతులు, సౌకర్యా ల కల్పనకు కృషిచేస్తానని జడ్పీ చైర్మన్‌ చెప్పారు. వైద్యులు, సిబ్బంది కరోనా సమయంలో రోగులకు చక్కటి సేవలు అందించారన్నారు. ఇటీవల దవా ఖానకు కాయకల్ప అవార్డు రావడం పై  వైద్యులను అభినందించారు.