కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ అన్ని రాష్ట్రాల వైద్య ఆరోగ్య శాఖ మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్.
న్యూఢిల్లీ,హైదరాబాద్ (ఆరోగ్యజ్యోతి): దేశంలో కరోనా సెకండ్ వేవ్ మొదలైన నేపథ్యంలో ఆ మహమ్మారి విస్తృతిపై కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్దన్ సమీక్ష నిర్వహించారు. పలు రాష్ట్రాల ఆరోగ్యశాఖ మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమై ఆయా రాష్ట్రాల్లో కరోనా స్థితిగతులపై చర్చించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అసోం, హర్యానా, హిమాచల్‌ప్రదేశ్, కేరళ, పంజాబ్, రాజస్థాన్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ వర్చువల్ సమావేశంలో పాల్గొన్నారు. ఆయా రాష్ట్రాల్లో కరోనా వైరస్ ప్రస్తుత పరిస్థితి, కరోనా కట్టడికి అనుసరిస్తున్న విధానాలు తదితర అంశాల గురించి ఈ సందర్భంగా రాష్ట్రమంత్రులను కేంద్రమంత్రి అడిగి తెలుసుకున్నారు. ఇంకా చేపట్టాల్సిన చర్యలపై చర్చించార. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ బూర్గులరామకృష్ణారావు భవన్ నుండి వీడియో కాన్ఫరెన్స్ పాల్గొని పరిస్థితిపై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ విన్నవించారు. తెలంగాణ తీసుకుంటున్న చర్యల పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన కేంద్రమంత్రి. పలు అంశాల్లో రాష్ట్రం తీసుకుంటున్న చర్యలను కేంద్ర మంత్రి అభినందించినరు. ఈ సందర్భంగా మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ ఇప్పటి వరకు తెలంగాణ లో 65లక్షల RTPCR టెస్టులు చేయడం జరిగిందని తెలిపినారు. అందులో 5శాతం మాత్రమె పాజిటివ్ వచయని పేర్కొన్నారు. 2.5లక్షల పాజిటివ్ కేసులు నమోదు కాగా అందులో 19వేల ఆక్టీవ్ కేసులు మాత్రమే ఉన్నాయని, రాష్ట్రలో డెత్ రేట్ 0.55శాతంగా ఉంద అని మంత్రి వీడియో కాన్ఫరెన్స్ తెలిపినారు. డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్, CHC,PHC సబ్ సెంటర్స్ అన్ని చోట్లా RTPCR టెస్టులు చేస్తున్నామని తెలిపినారు. రాష్ట్రంలో ఆక్సిజన్ కొరతలేదు,అన్ని హాస్పిటల్స్ లో లిక్విడ్ ఆక్సిజన్ సీలిండర్స్ అందుబాటులో ఉన్నాయని, మేము అన్ని రకాల ట్రీట్మెంట్ సౌకర్యాలు సమకూర్చుకున్నమని ఈ సందర్భంగా మంత్రి తెలిపినారు. ముందు ముందు రోజుల్లో సెకండ్ వేవ్ ని దృష్టిలో పెట్టుకొని అన్ని రకాలుగా ఎర్పాట్లు చేసుకున్నాం దాన్ని ఎదుర్కోవడాని మా సిబ్బంది అంత సిద్ధంగా ఉన్నామని మంత్రి తెలిపినారు. ICMR గైడెన్స్ పాటిస్తూ కరోనాని ఎదుర్కొంటున్నామన్నారు. అలాగే వ్యాక్సిన్ కి సంబంచిన డీటెయిల్స్ , సప్లై అండ్ ప్రియార్టీ కి సంబంధించిన సమాచారం కూడా మాకు ఇవ్వాలని మంత్రి గారు కోరారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, DME డాక్టర్ రమేష్ రెడ్డి , DH డాక్టర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.