మెగా హెల్త్‌క్యాంప్‌ నిర్వహణకు సన్నాహాలు

మంచిర్యాల(ఆరోగ్యజ్యోతి)‌ : హైదరాబాద్‌కు చెందిన సన్‌షైన్‌ సూపర్‌ స్పెషా లిటీ హాస్పిటల్‌ ఆధ్వర్యంలో డిసెంబర్‌ నెలాఖరు వరకు, జనవరి మొదటి వారంలో మెగా హెల్త్‌క్యాంప్‌ నిర్వహించేందుకు వైద్యులు, స్థానిక నాయకులు సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. 30 మం ది ప్రత్యేక వైద్యుల బృందం మంచిర్యాలలో వైద్య పరీక్షలు నిర్వ హిం చనున్నది. ఉచితంగా పరీక్షలు నిర్వహించి మందులు అందించనున్నా  రు. ఈ మేరకు బుధవారం మంచిర్యాలకు సన్‌షైన్‌ దవాఖాన వైద్యు లు శ్రీధర్‌ కస్తూరి, అనిల్‌, కుమార్‌, రాజగోపాల్‌ వచ్చారు. వారితో మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ ముకేశ్‌గౌడ్‌, టీఆర్‌ఎస్‌ బీసీ సెల్‌ పట్టణాధ్యక్షుడు గొంగళ్ల శంకర్‌, నాయకులు పొల్సాని సత్యనారాయణరావు, రాజేశ్‌ గౌడ్‌, తదితరులు సమావేశమయ్యారు. వైద్య శిబిరం నిర్వహణకు బస్టాండ్‌ ఎదుట ఉన్న ముకేశ్‌ గౌడ్‌ భవనాన్ని ఉపయోగించుకోవాలని నిర్ణయించారు. వైద్యుల బృందాన్ని పట్టణ టీఆర్‌ఎస్‌ నాయకులు ఘనంగా సన్మానించారు.