ఎస్పీ కార్యాలయంలో రక్తదాన శిబిరం

వికారాబాద్‌(ఆరోగ్యజ్యోతి):  శాంతి భద్రతల పరిరక్షణే పోలీసుల కర్తవ్యమని, పోలీసు వృత్తి బాధ్యతతోపాటు భరోసానిస్తుందని ఎస్పీ నారాయణ అన్నారు. శనివారం పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎస్పీ నారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ  మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానంతో సమానమని, విధి నిర్వహణలో కర్తవ్యమే లక్ష్యంగా ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరులను స్మరిస్తూ శిబిరాన్ని ఏర్పాటుచేసినట్లు తెలిపారు. అమరులైన పోలీసులను సమాజం ఎప్పటికీ మరువదని, వారి జ్ఞాపకార్థంగానే ఫ్లాగ్‌ డే, రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అనంతరం రక్తదానం చేసిన పోలీస్‌ సిబ్బంది, యువతకు ఎస్పీ నారాయణ పండ్లు అందజేశారు.  కార్యక్రమంలో డీఎస్పీ, ఏఆర్‌డీఎస్పీ, పరిగి, వికారాబాద్‌, కొడంగల్‌ సీఐలు, ప్రభుత్వ దవాఖాన డాక్టర్లు, ఎస్‌ఐలు  పాల్గొన్నారు.