అరటిపండుతో ఆరోగ్యం

 


రటి చెట్టు ఆసియా వాయువ్య దేశాలలో పుట్టింది. ఇప్పటికీ కూడా చాలా రకాల అడవి అరటి చెట్లు న్యూగినియామలేసియాఇండోనేషియాఫిలిప్పైన్సు లలో కనపడతాయి. ఇటివల దొరికిన పురావస్తు, శిలాజవాతావరణ శాస్త్ర ఆధారాలను బట్టి పపువా న్యూ గినియా లోని పశ్చిమ ద్వీప ఖండములోని కుక్‌ స్వాంపు వద్ద క్రీస్తు పూర్వం 8000 లేదా 5000 సంవత్సరాల నుండే అరటి తోటల పెంపకం సాగినట్లు నిర్ధారించారు. కాబట్టి న్యూ గినియాలో తొలి అరటి తోటల పెంపకం జరిగినట్లు నిర్ధారించవచ్చు. తరువాత ఇతర అడవి అరటి జాతులు దక్షిణ ఆసియా ఖండములో పెంపకము చేసినట్లు భావించవచ్చు.వ్రాత ప్రతులలో మొదటిసారిగా అరటి ప్రస్తావన మనకు క్రీస్తు పూర్వం 600 సంవత్సరములో వ్రాసిన బౌద్ధ సాహిత్యంలో కనపడుతుంది. అలెగ్జాండరు తొలిసారిగా క్రీస్తు పూర్వం 327 వ సంవత్సరములో భారత దేశంలో వీటి రుచి చ్జూశాడు. చైనాలో క్రీస్తు శకం 200 సంవత్సరము నుండి అరటి తోటల పెంపకం సాగినట్లుగా మనకు ఆధారాలు లభ్యమవుతున్నాయి. క్రీస్తు శకం 650 వ సంవత్సరములో ముస్లిం దండయాత్రల వల్ల అరటి పాలస్తీనా ప్రాంతానికీ, తరువాత ఆఫ్రికా ఖండానికీ వ్యాప్తి చెందింది. అలంటి  అరిటిపండు గురించి మహ్మద్ కలీముల్లా ఆరోగ్యకార్యకర్త (మగ)పట్టణ మలేరియాపథకం నల్లగొండ పూర్తిగా వివరించారు.



వందగ్రాముల అరటిలో వున్న పోషకాలు


·         నీరు - 70.1 గ్రా.


·         ప్రోటీన్ - 1.2 గ్రా.


·         కొవ్వుపదార్థాలు - 0.3 గ్రా.


·         పిండిపదార్థాలు - 27.2 గ్రా.


·         కాల్షియం - 17 మి.గ్రా.


·         ఇనుము - 0.4మి.గ్రా.


·         సోడియం - 37 మి.గ్రా.


·         పొటాషియం - 88 మి.గ్రా.


·         రాగి - 0.16 మి.గ్రా.


·         మాంగనీసు - 0.2 మి.గ్రా.


·         జింక్ - 0.15 మి.గ్రా.


·         క్రోమియం - 0.004 మి.గ్రా.


·         కెరోటిన్ - 78 మైక్రో గ్రా.


·         రైబోఫ్లెవిన్ - 0.08 మి.గ్రా.


·         సి విటమిన్ - 7 మి.గ్రా.


·         థయామిన్ - 0.05 మి.గ్రా.


·         నియాసిన్ - 0.5 మి.గ్రా.


·         శక్తి - 116 కిలోకాలరీలు


 


 అరటిపండు అన్ని వేళలా అందుబాటులో ఉంటుంది. రెడీగా ఆరోగ్యాన్నిస్తుంది. ఈ పండు చేకూర్చే ఆరోగ్య ప్రయోజనాల్లో కొన్ని....


 



  • అరటిపండులో పొటాషియమ్ పాళ్లు చాలా ఎక్కువ. దాంతో అది రక్తపోటును స్వాభావికంగా నియంత్రిస్తుంది .

  • ఇందులో ఉండే పొటాషయమ్ గుండె ఆరోగ్యాన్ని కాపాడేందుకు తోడ్పడుతుందని యూనివర్సిటీ ఆఫ్ అలబామా పరిశోధకుల అధ్యయనాల్లో తేలింది.

  • అరటిపండులోని ట్రిప్టోఫాన్ ను మన శరీరం సెరిటోనిన్ గా మార్చుకుంటుంది.

  • ఈ సెరిటోనిన్ మన మూడ్స్ బాగుండేలా చూసే రసాయనం.

  • అరటిపండులో పీచు (ఫైబర్) పుష్కలంగా ఉంటుంది. అది మన జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

  • అరటిలోని అమైనో యాసిడ్స్ అద్భుతమైఅరటిపండు కంటి ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది. మాక్యులార్ డీజనరేషన్ వంటి కంటి వ్యాధులను నివారిస్తుంది.

  • అరటిలో క్యాల్షియమ్ పాట్లు ఎక్కువ. అందుకే ఇది ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అంతేగాక వీటిలోని క్యాల్షియమ్ మన ఒంట్లోకి తేలిగ్గా ఇంకేలా

  • అరటిపండులోనే పుష్కలంగా ఉండే ఫ్రక్టోలిగోశాకరైడ్స్ అనే పదార్థం దోహదం చేస్తుంది.