హైదరాబాద్ (ఆరోగ్యజ్యోతి ):బీబీనగర్ నిమ్స్ ఆస్పత్రి పై సమీక్ష సమావేశాన్ని సోమవారం నాడు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు ఈ సమీక్ష సమావేశంలో బీబీనగర్ డైరెక్టర్ తో పాటు వైద్యులు సమావేశానికి హాజరయ్యారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రిమ్స్లో ప్రస్తుతం చదువుతున్న విద్యార్థుల వివరాలను తెలుసుకున్నాడు ఆసుపత్రి నిర్మాణం పనులు నిర్వహణ సమస్యలపై సుదీర్ఘంగా మంత్రి అధికారులతో చర్చించారు నీటి సరఫరా భవన నిర్మాణం ఇతర సమస్యలు లేకుండా చూడాలని స్థానిక అధికారులకు ప్రజాప్రతినిధులకు కలిసి సమయంతో ముందుకు తీసుకెళ్లాలని వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి కి మంత్రి ఆదేశించారు ఈ సమావేశంలోఎఐఎంఎస్ గవర్నింగ్ బాడీ మెంబర్ బండ ప్రకాష్ , వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, బీబీ నగర్ AIMS డైరెక్టర్ వికాస్ భాటియా, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ అనంత రావు, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ రమేష్ రెడ్డి, నిమ్స్ డైరెక్టర్ మనోహర్ తదితరులు పాల్గొన్నారు.