కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలి

- ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి


నీలగిరి(ఆరోగ్యజ్యోతి) : కరోనా మహమ్మారి బారిన పడకుండా ప్రతిఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. నల్లగొండ పట్టణంలోని మున్సిపల్‌ కార్మికులకు శుక్రవారం బీట్‌ మార్కెట్‌లో ఏర్పాటుచేసిన ఉచిత వైద్యశిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మున్సిపల్‌ కార్మికుల శ్రేయస్సు కోసం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. గతంలో తక్కువ మందితో ఎక్కువ పని చేయించేవారని,  చెత్తను తరలించడానికి ట్రాక్టర్లు, ఆటోలు సైతం సక్రమంగా ఉండేవికావని గుర్తుచేశారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక పారిశుధ్య కార్మికుల సంఖ్యను పెంచడంతోపాటు ట్రాక్టర్లు, ఆటోలు, జేసీబీ, స్వీపింగ్‌ మిషన్‌, లోడర్లు కొనుగోలు చేశామన్నారు. కార్మికులు ఆరోగ్యంగా ఉంటేనే పట్టణ ప్రజలు ఆరోగ్యంగా ఉంటారనే భావనతో ఉచిత వైద్యశిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ మందడి సైదిరెడ్డి, డీఎంహెచ్‌ఓ అన్నిమళ్ల కొండల్‌రావు, కమిషనర్‌ బచ్చలకూరి శరత్‌చంద్ర, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ అరుంధతి, డాక్టర్లు విశ్వజ్యోతి, నితిన్‌, వైస్‌ చైర్మన్‌ అబ్బగోని రమేశ్‌, కౌన్సిలర్లు యామ కవిత, ఖయ్యూంబేగ్‌, వట్టిపల్లి శ్రీనివాస్‌, పర్హత్‌ ఫర్జాన తదితరులు పాల్గొన్నారు.