వైద్యుల నిర్లక్ష్యంతో శిశువు మృతి

సూర్యాపేట(ఆరోగ్యజ్యోతి): వైద్య సిబ్బంది నిర్వాకంతో శిశువు ప్రాణాలు కోల్పోయాడు. వైద్యుల నిర్లక్ష్యంతో శిశువు మృతి చెందాడని ఆస్పత్రి ఎదుట బంధువులు బుధవారం ఆందోళనకు దిగారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా జనరల్ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. పెనుపహడ్ మండల కేంద్రానికి చెందిన ఒగ్గు పాల్గున శ్రీలత మొదటి ప్రసవం కోసం ఆస్పత్రికి వచ్చింది. శ్రీలతకు మంగళవారం అర్ధరాత్రి డాక్టర్ కు బదులు నర్సులు ఆపరేషన్ నిర్వహించారు. ఈ క్రమంలో సిబ్బంది కంగారులో కత్తెరలతో శిశువు తలపై గాయం చేశారు. బ్లీడింగ్ తో మగశిశువు మృతి చెందాడు.