హైదరాబాద్(ఆరోగ్యజ్యోతి) : నిమ్స్ ఆస్పత్రిలో పారామెడికల్ కోర్సుల ప్రవేశం కోసం అభ్యర్థుల ఆన్‌లైన్ దరఖాస్తుల తేదీని నవంబర్ 18కి పొడిగించినట్లు నిమ్స్ ఆస్పత్రి వర్గాలు ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు వెబ్‌సైట్‌లో ఉన్న వివరాల ప్రకారం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. మరి న్ని వివరాలకు నిమ్స్ వెబ్‌సైట్‌ను సందర్శించాలని కోరారు.