- ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్
హైదరాబాద్ (ఆరోగ్యజ్యోతి): నాంపల్లి పరిధిలోని సయ్యద్ నగర్‌లో ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ బస్తీ దవఖానాను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్, మేయర్ బొంతు రామ్మోహన్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.బస్తీ దవాఖాన ప్రారంభం అనంతరం కేటీఆర్ మాట్లాడాతూ ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్యం అందించడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని మంత్రి ఉద్ఘాటించారు. బస్తీ దవాఖానాల్లో డయాగ్నోస్టిక్ సేవలు కూడా అందుబాటులో ఉంటాయని ఈ సందర్భంగా కేటీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలో ఇప్పటికే 224 బస్తీ దవఖానాలు ప్రారంభించుకున్నామని తెలిపారు. మరో 125 బస్తీ దవఖానాలను త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పారు. బస్తీ దవాఖానాల ద్వారా పేదలకు మెరుగైన వైద్యం అందుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు.