హైదరాబాద్, (ఆరోగ్యజ్యోతి): వైద్యారోగ్యశాఖలోని స్టాఫ్ నర్స్ పోస్టులకు 1: 2 ప్రాతిపదికన ఎంపిక చేసిన అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహిస్తున్నట్లు టీఎస్‌పీఎస్సీ శనివారం ప్రకటించింది. ఈనెల 13 నుంచి 19 వరకు ఆన్‌లైన్ ద్వారా అభ్యర్థులు ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఎంపికైన అభ్యర్థుల వివరాలు, ఇతర సమాచారం కోసం వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించింది. మొత్తం 3,311 పోస్టులకు 26,412 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో పరీక్షలకు హాజరైన 21,391 మందితో కూడిన మెరిట్ జాబితాను టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. నోటిఫికేషన్‌లో పేర్కొన్న నిబంధనల మేరకు మెరిట్ జాబితాను, జీవోఎంఎస్ నెం.216, 26 ప్రకారం మార్కు ల జాబితా రూపొందించామని కమిషన్ స్పష్టంచేసింది. కమిషన్ వెబ్‌సైట్‌లో పూర్తివివరాలు అందుబాటులో ఉంటాయని సూచించింది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సైప్లె అండ్ సీవరేజ్ బోర్డ్ ఇంజినీరింగ్ సర్వీస్ డిపార్ట్‌మెంట్ (జలమండలి)లో మేనేజర్ పోస్టుల భర్తీకి సంబంధించిన హాల్‌టికెట్లు ఆన్‌లైన్‌లో పొందుపరిచినట్లు టీఎస్‌పీఎస్సీ శనివారం ప్రకటించింది.