కలెక్టరేట్‌ వద్ద ఆశా వర్కర్ల ధర్నా

గుంటూరు(ఆరోగ్యజ్యోతి): ఆశా వర్కర్లను సచివాలయాలకు కేటాయించొద్దని, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ ఇవ్వాలని, సంక్షేమ పథకాలను వర్తింపజేయాలని డిమాండ్‌ చేస్తూ గుంటూరు కలెక్టరేట్‌ వద్ద గురువారం ధర్నా చేపట్టారు. కలెక్టరేట్‌ ముట్టడికి యత్నించిన ఆశా వర్కర్లను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు, వర్కర్లకు తీవ్ర స్థాయిలో తోపులాట జరిగింది. ఆశావర్కర్స్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి డి.శివకుమారి మాట్లాడుతూ ఆశలు ఉదయం లేచి నుంచి రాత్రి వరకు ఎంతో కష్టపడి పని చేస్తున్నారని ఈ సందర్భంగా ఆమె తెలిపారు ప్రజా ఆరోగ్యం కోసం ఎంతగానో కృషి చేస్తున్న ఆశ వర్కర్లకు ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని ఆమె కోరారు .ఆశావర్కర్స్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి డి.శివకుమారి   సిఐటియు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు దందా లక్ష్మీనారాయణ, వై.నేతాజీ, తదితరుల్ని పోలీసులు అరెస్ట్‌ చేశారు.