ఉప్పల్(ఆరోగ్యజ్యోతి): కార్మికులకు వైద్యసేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
తీసుకుంటామని మంత్రి సీహెచ్.మల్లారెడ్డి హెచ్చరించారు. నాచారంలోని ఈఎస్‌ఐ
దవాఖానలో సోమవారం ఉద్యోగులు, వైద్యులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ
సందర్భంగా పలు అంశాలపై మాట్లాడారు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న సిబ్బందిపై
ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈఎస్‌ఐ పరిధిలోని 29 డిస్పెన్సరీల్లో స్టాప్ కొరతపై చర్చించారు.
ఓపీ సేవలలో ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. సేవ చేస్తూ సంతృప్తి పొందాలని, కష్టపడి పనిచేయాలన్నారు. వైద్యులు, ఉద్యోగులు సమన్వయంతో పనిచేస్తూ కార్మికులకు
సేవలు అందేవిధంగా చూడాలన్నారు. యూనియన్ నేతలతో పలు అంశాలపై చర్చించారు. మెరుగైన
వైద్యసేవలు అందేవిధంగా వైద్యులు కృషిచేయాలన్నారు. డిస్పెన్సరీల్లో ఇబ్బందులు
లేకుండా చూడాలని ఆదేశించారు. అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు తక్షణమే
పరిష్కరించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఉన్నతాధికారులు, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.