కలెక్టర్ కార్యాలయ ఉద్యోగులకు కరోనా చికిత్సలు

 

- ఇంచార్జి జిల్లా రెవెన్యూ అధికారి రాథోడ్ రమేష్

    నిర్మల్(ఆరోగ్యజ్యోతి): జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కార్యాలయ రెవెన్యూ ఉద్యోగులకు, ఇబ్బందికి కరోనా వైద్య చికిత్సలు నిర్వహించడం జరిగిందని ఇంచార్జి జిల్లా రెవెన్యూ అధికారి రాథోడ్ రమేష్ అన్నారు. గురువారం ఉదయం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కరోనా ప్రత్యేక అధికారి డాక్టర్ కార్తీక్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి కార్యాలయ అధికారులకు, సిబ్బందికి బీపీ, షుగర్, టిబి, కరోనా చికిత్సల కై నమూనాలు సేకరించారు. అనంతరం డిఆర్ఓ రమేష్ రాథోడ్ మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాల మేరకు కార్యాలయ అధికారులకు రెవెన్యూ సిబ్బందికి బిపి, షుగర్, టీబీ కరోనా  చికిత్సలకై  వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మొత్తం 48 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఒకరికి మాత్రమే కరోనా పాజిటివ్ అని నిర్ధారణ జరిగిందన్నారు. దశలవారీగా అన్ని ప్రభుత్వ కార్యాలయ ఉద్యోగులకు కరోనా చికిత్స లు  నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కార్యాలయ పరిపాలన అధికారి కరీం, పర్యవేక్షకులు రహీమ్ ఉద్దీన్ హిమబిందు, EDMనదీం, అధికారులు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.