పూర్తి స్థాయి జాగ్రత్తలు పాటిస్తే అదుపులో వ్యాధులు

  • Ø వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్

 హైదరాబాద్,(ఆరోగ్యజ్యోతి): పూర్తిస్థాయి జాగ్రత్తలు అవగాహన కల్పించినట్లు అయితే వ్యాధులు అదుపులో ఉంచుకోవచ్చని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారుప్రేవెంటివే హెల్త్ కేర్ అండ్ ఇన్ఫెక్షన్ కంట్రోల్- 2020 పేరుతో సేఫ్ రీ ఓపెనింగ్ of స్కూల్స్ కాన్సెప్ట్ తో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ సైంటిస్టులు, వైద్యులు ప్రజా ఆరోగ్యాన్ని కాపాడేందుకు కోసం ఎంతగానో కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఉదాహరణగా తీసుకున్నట్లయితే ఇటీవల కరోనా వచ్చిందంటే ప్రజలు భయభ్రాంతులకు గురైనారు అని తెలిపారు.కరోనాను అదుపు చేయడం కోసం ప్రపంచం అన్ని దేశాలు అనేక ఇబ్బందులు పద్దయన్నారు.చైనాలో మొట్టమొదటిసారిగా వచ్చిన కరోనా వ్యాధి అదుపు చేయడం కోసం వాళ్లు అనేక కష్టాలు పడ్డారని,  చివరకు అదుపు చేసిందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. అదేసమయంలో ప్రపంచం మొత్తం వ్యాపించడంతో భారతదేశం లాంటి దేశాలు ఇస్తారని ప్రపంచ దేశాలు దృష్టి పెట్టిందని కానీ భారతదేశంలో కరుణ అదుపు చేయగలిగామని తెలిపారు అమెరికా విషయానికి వస్తే అభివృద్ధి చెందిన దేశం అయినప్పటికీ కంట్రోల్ చేయడం లో ఎన్నో కష్టాలు పడ్డారు అని ఆయన పేర్కొన్నారు ఆసక్తికరమైన వచ్చిన సమయంలో ఆస్తి అంతస్తు డబ్బు చదువు మాకు వద్దు బ్రతికి ఉంటే బ్రతకవచ్చు అని ప్రజలు నిర్ణయించుకున్నారని అలాంటి పరిస్థితి మరి ఎప్పుడు రాకూడదన్నారు.