కార్మికుల అక్రమంగా తొలగించిన వారిని విధుల్లోకి తీసుకోవాలి

 


అనంతపురం (ఆరోగ్యజ్యోతి):  శ్రీ రామ్ రెడ్డి వాటర్ వర్క్స్,ఆర్ డబ్ల్యూ యస్  కార్మికుల అక్రమంగా తొలగించిన వారిని విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో కదిరి పట్టణం అడపాల వీధి లోని ఆర్డబ్ల్యుఎస్ కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్షలను సిఐటియు రాష్ట్ర నాయకులు నూర్ మహమ్మద్, డివిజన్ నాయకులు సాంబశివ ప్రారంభించారు.(ఈ దీక్షలు ఈరోజు నుండి 25 తేదీ జరుగుతాయినీ తెలిపారు.ఈ సందర్భంగా వారు  మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్త పార్టీ ప్రతిసారి ఉద్యోగులను తొలగించీ వారి పార్టీ కార్యకర్తల ను పెట్టుకోవడం దుర్మార్గమైన  చర్య అన్నారు.జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగి ఒకరిని తొలగించమని పదే పదే చెప్పిన స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి అనుచరులు అధికారులపై ఒత్తిడి చేసి పని చేస్తున్నటువంటి ఉద్యోగులను తొలగించడం దుర్మార్గమైన చర్య. అదేవిధంగా గత పది నెలలుగా పెండింగ్ లో ఉన్నటువంటి వేతనాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. భారతదేశ అత్యున్నత న్యాయస్థానం కనీస వేతనం అమలు చేయాలని ప్రభుత్వానికి ప్రైవేటు యజమానులకు ఆదేశాలు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి ఉద్యోగులను కనీస వేతనం అమలు చేయకపోవడం శోచనీయం. స్థానిక ఎమ్మెల్యే సిద్ధారెడ్డి బంధువులే కొత్తగా కాంట్రాక్టర్లు గా వచ్చి ఎన్నో ఏళ్ళుగా ఉద్యోగం చేస్సే వాళ్ళనీ తొలగించడం, ఈఎస్ఐ, పీఎఫ్ చెల్లించక  పోవడం దారుణం. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని కార్మికుల యొక్క సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో ఓబులేసు, ఆదినారాయణ, నరశింహులు ,రవి ,విజయ్ ,లోకేష్, రామ చంద్ర ,వెంకటేష్, లక్ష్మీ పతి తదితరులు పాల్గొన్నారు...