బంగారు భవిష్యత్తుకు పునాది బాల్య దశ

  -హెడ్ కానిస్టేబుల్ సత్యం

 కావలి  (ఆరోగ్యజ్యోతి):  కావలి పట్టణంలో 6వ వార్డు వెంగయ్యగారిపాలెం అర్బన్ -  2  అంగనివాడి కేంద్రం ఆవరణంలో నాన్  గౌవర్నమెంటల్ ఆర్గనైజేషన్ ఫెడరేషన్ ఆంద్రప్రదేశ్ మరియు ది పూర్ పీపుల్స్ వాలంటరీ ఆర్గనైజేషన్ సంయుక్త ఆధ్వర్యంలో   ఆర్గనైజేషన్ అధ్యక్షుడు డాక్టర్ చేవూరుచిన్న నిర్వహించిన చైల్డ్ రైట్స్ డే ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పోలీసు శాఖ id పార్టీ హెడ్ కానిస్టేబుల్ సత్యం మాట్లాడుతూ ప్రపంచ పిల్లల దినోత్సవం రోజున  పిల్లలకు అవగాహన మరియు వారి సంక్షేమాన్ని మెరుగుపరచడానికి, వారి హక్కులు తెలుసుకోవాలని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు,   సమాజ ఆర్థిక అభివృద్ధి వెనుక నడుస్తున్న యుగంలో పౌర, ఆర్థిక, సామాజిక మరియు సాంస్కృతిక సమస్యల కోసం సమాజంలోని దుష్ట వర్గాలచే దోపిడీకి గురైయే పిల్లలను హక్కులపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం అని ఆయన అన్నారు. సంస్థ అధ్యక్షుడు డాక్టర్ చేవూరుచిన్న మాట్లాడుతూ ఇంకా బాలకార్మిక వ్యవస్థ, బాలల వేధింపులు, అత్యాచారాలు,మరియు బాల్యవివాహాలు జరుగుతున్నవి ఇవి అరికట్టాల్సిన భాద్యత మనందరిపై ఉందని, విద్యా హక్కు ప్రాథమిక హక్కు అయినప్పటికీ, మారుమూల మరియు వెనుకబడిన ప్రాంతాల్లో చాలామంది ప్రజలు తమ పిల్లలను పాఠశాలలుకు పంపటంలేదు, బంగారు భవిష్యత్తుకు పునాధిపడే దశ బాల్య దశ, ఇలాంటి కీలకదశలో బాలలను చదువు, ఆటలకు దూరం కాకూడదు అని ఆయన అన్నారు. సచివాలయం మహిళ సంరక్షణ కార్యదర్శి   బచ్చు యస్వాశ్విని మాట్లాడుతూ ఆనాదులు కావటం వలన, పేదరికం, నిరక్షరాస్యత తదితర కారణంవలన బాలలు కార్మికులు గా మారుతున్నారు అని బాలకార్మిక, బాల్యవివాహాలు, విద్యా పై అవగాహన మరియు సహాయ సహకారాలు అందిస్తున్న ది పూర్ పీపుల్స్ వాలంటరీ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు డాక్టర్ చేవూరుచిన్న ను అభినందిస్తున్నామని ఆమె అన్నారు. పై కార్యక్రమంలో పేద కుటుంబ మహిళలు  ఎక్కువ ఆడపిల్లల కలవారిని వారి బిడ్డలను మంచి ప్రయోజకులను చేసినందుకు వారిని సన్మానించారు,అనంతరం పిల్లలకు ఆటల పోటీలు నిర్వహించి వారికి బహుమతులు సత్యం అందించారు స్వీట్స్ పంపిణీ చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు పద్మ, 6 వ వార్డు మాజీ కౌన్సిలర్ ఎడుంబాకం వెంకయ్య,    సచివాలయం అడ్మిన్ రఘుదీప్ కుమార్, అంగనివాడి టీచర్ శ్రీకళ, పద్మకుమారి, ఏ ఎన్ యం. శ్రీదేవి, సంస్థ సభ్యులు విక్లిఫ్, వెస్లీ రూత్,   5 వ సచివాలయం వాలంటరీలు, ఆశ వర్కర్లు, తదితరులు పాల్గొన్నారు.