నేడు మంత్రి కేటీఆర్‌ రోడ్‌షో షెడ్యూల్‌

 కూకట్‌పల్లి(aroగ్యజ్యోతి) : టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ శనివారం నుంచి గ్రేటర్‌ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. తొలిరోజు   కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గాల్లో అభ్యర్థులతో కలిసి రోడ్‌ షో నిర్వహించనున్నారు. మంత్రి పర్యటనను విజయవంతం చేయాలని మంత్రులు చామకూర మల్లారెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యే కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌ కోరారు.