ప్రధాన కంటెంట్‌కు దాటవేయి
మంత్రి సబితకు కరోనా వారియర్ అవార్డు
దుండిగల్(ఆరోగ్యజ్యోతి): కరోనా సమయంలో క్షేత్రస్థాయిలో ప్రజలకు
ధైర్యాన్ని నింపడంతో పాటు వెన్నుదన్నుగా నిలిచిన విద్యాశాఖ మంత్రి సబితా
ఇంద్రారెడ్డికి అంతర్జాతీయ కరోనా వారియర్ అవార్డు లభించింది. సోమవారం మంత్రి
కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలోవిశ్వగురు వరల్డ్ రికార్డు సంస్థ వ్యవస్థాపకులు
సత్యవోలు రాంబాబు కరోనా వారియర్ అవార్డును మంత్రికి అందజేశారు.అనంతరం రాంబాబు
మాట్లాడుతూ మంత్రి సేవలను గుర్తించి విశ్వగురు వరల్డ్ రికార్డు సంస్థ ఆమెకు కరోనా
వారియర్ అవార్డును అందజేసినట్లు తెలిపారు.కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నేతలు
పాండురంగారెడ్డి, సాయికిరణ్‌రెడ్డి, కృష్ణ, సాంబశివ, దీక్షిత్‌రెడ్డి, కార్తీక్‌రెడ్డి, నర్సింహారెడ్డి పాల్గొన్నారు.