మలేరియా నివారణకు జాగ్రత్తలు అవసరం

 

హత్నూరా(ఆరోగ్యజ్యోతి): మలేరియా నివారణ కొరకు ప్రతి ఒక్కరు జాగ్రత్తలు వహించాలని హత్నూరా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ శ్రీ రామ సుధాకర్ లు అన్నారు. శుక్రవారం నాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మలేరియా పై అవగాహన కార్యక్రమాన్ని స్టాఫ్ నర్సులకు, ఆరోగ్య కార్యకర్తలకు, ఆశా కార్యకర్తలకు వైద్య ఆరోగ్య సిబ్బంది అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మలేరియా వ్యాధి రాకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. గ్రామాల్లో  పారిశుద్ధ్యం ఎప్పటికప్పుడు శుబ్రం  చేసుకోవాలని తెలిపారు. రోడ్లపై మురుగు నీరు నిల్వ ఉండకుండా చూడాలని ఆయన తెలిపారు. ముఖ్యంగా చెత్తాచెదారం వల్ల దోమలు వృద్ధి చెంది వాటి వల్ల మలేరియా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. ఆశా కార్యకర్తలు గ్రామాల్లో పారిశుధ్యం పై అవగాహన కార్యక్రమం నిర్వహించడం తో పాటు ఈ సమావేశాలు నిర్వహించాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్.శ్రీవాని,డాక్టర్. శంకర్ నాయక  డాక్టర్. నెత్రావతి. పిఎహెన్ భారతి, సుపరవైజార్ బాల్య, సిబ్బంది నాగభూషణం . ఉమాకాంత, సాయి ప్రసాద్,  శ్రీకాంత్, అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు.