ప్లాస్మా దాతకు సన్మానం

యైటింక్లయిన్‌ కాలనీ,(ఆరోగ్యజ్యోతి): ప్లాస్మా దానం చేసిన వైకే ఫౌండేషన్‌ సభ్యుడిని ఆ సంస్థ ప్రతినిధులు సన్మానించారు. ఈ మేరకు స్థానిక టూ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో సీఐ శ్రీనివాస రావు చేతుల మీదుగా శాలువా కప్పి సన్మానించి, అభినందించారు. హైదరాబాద్‌లోని కిమ్స్‌ దవాఖానలో ఒజ్జల శ్రీనివాస్‌ అనే కరోనా బాధితుడికి బీ పాజిటివ్‌ ప్లాస్మా అవసరం ఉండగా, యైటింక్లయిన్‌ కాలనీకి చెందిన షేక్‌ ముజాహిద్‌ అక్రమ్‌ దానం చేసి ఆదుకోవడంపై అభినందించారు. రక్తదానం అవసరం ఉన్నవారు వైకే ఫౌండేషన్‌ 98664 70788, 99897 78829లో సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో  కండెం సురేశ్‌, ఎస్‌ఐ కళాధర్‌ రెడ్డి,  బెల్లంకొండ విజేందర్‌ రెడ్డి, కార్తిక్‌, అమర్‌, నిఖిల్‌, అరవింద్‌, లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు.