ఆదిలాబాద్(ఆరోగ్యజ్యోతి); ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కామన్ సర్వీస్ సెంటర్ సిఎస్సి బతుకమ్మను ఏర్పాటు చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ రకాల సేవలను ప్రజల్లోకి తీసుకు వెళ్ళిన దిశగా ఆదిలాబాద్ లో సిఎస్సి బతుకమ్మను నిర్వహించారు .ప్రజలకు అన్ని రకాల సేవలు అందించాలనే ఉద్దేశంతో సిఎస్సి బతుకమ్మను ఏర్పాటు చేయడం జరిగిందని కామన్ సర్వీస్ సెంటర్ జిల్లా మేనేజర్ కమేరి రాహుల్ ఈయన తోపాటు జిల్లా కోఆర్డినేటర్ గా లంక కిరణ్ లు తెలిపారు. ప్రజలు కు విద్య, వ్యవసాయం, వైద్యం, రవాణా,రీచార్జ్, తో పాటు అనేక రకాల సేవలు అందుబాటులోకి వచ్చాయన్నారు.వీటితో పాటు సిఎస్సిలో వందల రకాల సేవలు అన్డుభాటులో ఉన్నాయని ప్రజలుఇ వీటిని వినియోగించుకోవాలని ఈ సందర్భంగా వారు సూచించారు.