హైదరాబాద్,(ఆరోగ్యజ్యోతి):కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఓటర్ నమోదు గడువును సద్వినియోగపర్చుకోవాలని పట్టభద్రుల జెఎసి అధ్యక్షుడువ వుప్పు సత్యనారాయణ అన్నారు. ఓటరు నమోదు కార్యక్రమం తిరిగి డిసెంబర్ ఫస్ట్ నుండి మొదలై నెలాఖరు వరకు వరకు కొనసాగనున్నదని ఆయన తెలిపారు. పోచారం మున్సిపాల్టీ పరిది లోని దివ్యాంగుల కాలనీలో పట్టభద్రుల ఓటు హక్కు నమోదు, అవగాహన సదస్సులొ పట్టభద్రుల సంఘం అధ్యక్షులు ఉప్పు సత్యనారాయణ పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలొ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులు మొక్క ఉపేందర్ ఆధ్వర్యంలో జరిగినది. ఇప్పటివరకు సకాలంలో సమాచారం అందక ఓటరు నమోదు చేసుకోని పట్టభద్రులందరు విధిగా ఓటరుగా నమోదై ఓటు హక్కును సాధించాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల ఓటరుగా నమోదయన సందర్భంగా జరిగిన తప్పొప్పులను కూడా డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి సరిదిద్దుకోవచ్చని వుప్పు సత్యనారాయణ వివరించారు.ఈ అవకాశం మరో ఆరేళ్ల వరకు గానీ రాదని, ఓటర్ నమోదులో ఎట్టి పరిస్థితులలో నిర్లక్ష్యం తగదని ఆయన హెచ్చరించారు. ఓటు హక్కు జన్మకు లాంటిదని ఓటు హక్కు లేకపోతే, రావాల్సిన హక్కులను కోల్పోయే ప్రమాదం ఉందని ఉప్పు సత్యనారాయణ హెచ్చరించారు. ముఖ్యంగా నిరుద్యోగ భృతి ఉపాధి కల్పన సాధించడమే ఏకైక లక్ష్యమన్నారు. ఈకార్యక్రమంలో కాలనీలోని పట్టభద్రులు రాంబాబు, జర్నలిస్టు అశోక్, బుల్లిబాబు, భూలక్మీ, బి.బాబు, సాలమ్మ, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.