హైదరాబాద్,(ఆరోగ్యజ్యోతి): రాష్ట్రంలో మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగటంలో వీహబ్ కీలకపాత్ర పోషిస్తున్నదని ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. వీహబ్ ఇంక్యుబేటెడ్ స్టార్టప్.. స్మార్ట్ ఫార్మాను ప్రశంసించారు. క్లౌడ్ ఆధారిత సాస్ (సాఫ్ట్‌వేర్ యాస్ ఏ సర్వీస్) స్టార్టప్ స్మార్ట్ ఫార్మా.. ఫార్మాస్యూటికల్ సైప్లె చైన్ విభాగంలో చక్కని పరిష్కారం కనుగొన్నదని అభినందించారు. రూ.2 కోట్ల పెట్టుబడులు ఆకర్షించిన నేపథ్యంలో వీహబ్ సీఈవో దీప్తీ రావుల, స్మార్ట్‌ఫార్మా ఫౌండర్ సాకేత గురువారం ప్రగతిభవన్‌లో మంత్రి కేటీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. వీహబ్ సాంకేతిక, ఆర్థిక సమస్యలకూ పరిష్కారం చూపుతున్నదని పేర్కొన్నారు. మరోవైపు, సెకండ్ ఇంక్యుబేషన్ కోహర్ట్‌లో అవకాశం కోసం దేశంలోని 16 నగరాల నుంచి 26 స్టార్టప్‌లు ఎంపిక కాగా, అందులో స్మార్ట్‌ఫార్మా.. బల్క్‌డ్రగ్స్ పంపిణీని సులభతరం చేయడంపై రూపొందించిన స్టార్టప్ కూడా ఉన్నది.