ఆరోగ్య పరిరక్షణ కోసం కృషి చేయాలి


  • వైద్య అధికారిని శ్రావణి


మెదక్, చిన్న శంకరంపేట(ఆరోగ్యజ్యోతి): ఆరోగ్యమే మహాభాగ్యము కావున ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటే ఏ రోగాలు రావు అని చిన్న శంకరం పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారిని డాక్టర్ శ్రావణి తెలిపారు సోమవారం శంకరంపేట(ఆర్) ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా కార్యకర్తల సమావేశంలో గ్రామాల్లో  సత్వర ఆరోగ్య పరిరక్షణ కోసం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆశా వర్కర్లు పాల్గొనగా గ్రామాలలో ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచితే అంటువ్యాధులతో కబడి తెలిపారు. అలాగే గ్రామాలలో గర్భిణీ స్త్రీలకు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకురావాలని ఆశా వర్కర్లకు సూచించారు. గర్భిణి స్త్రీలు పోషక ఆహారాలు తీసుకోవాలని సూచించారు పాలు గుడ్లు మాంసకృత్తులు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలని తెలిపారు.