- ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలతో కలిసి బస్తీ దవాఖానా ప్రారంభించిన మంత్రి ఈటెల
హైదరాబాద్,(ఆరోగ్యజ్యోతి): కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, 131 కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధిలోని దత్తాత్రేయ నగర్ లో ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాను గురువారం ఉదయం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ,ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే కేపి వివేకానంద్, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ వాకాటి కరుణ ,జోనల్ కమిషనర్ మమత, స్థానిక డివిజన్ అధ్యక్షులు కెఎం గౌరీష్ తో కలిసిమంత్రి ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి బస్సు దుకాణాలను ఏర్పాటు చేస్తుందన్నారు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇప్పటివరకు 200 ద్వారా ప్రజలకు వైద్య సేవలు అందించడం జరుగుతుందన్నారు జబ్బుకు ఇక్కడ అన్ని రకాల చికిత్సలు అందించడంతో పాటు వైద్య పరీక్షలు కూడా చేయడం జరుగుతుందన్నారు వైద్య పరీక్షల నిమిత్తం ఉచిత మందులు కూడా ఇవ్వడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ప్రజలకు మెరుగైన వైద్యం కోసం, పేద ప్రజలకు ఇంటి వద్దే ఉచిత వైద్యం అందించాలనే సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బస్తీ దవాఖానలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. . నగరంలో మరో 90 బస్తీ దవాఖానాలు ఏర్పాటుచేస్తామని ప్రకటించారు.గ్రేటర్ హైదరాబాద్‌లో ఇప్పటికే 199 బస్తీ దవాఖానాల్లో సేవలందుతున్నాయి. వారం రోజుల్లో మరో 30 బస్తీ దవాఖానాలను ప్రభుత్వం ప్రారంభించనుంది. దీంతో నగరంలో బస్తీ దవాఖానాల సంఖ్య మొత్తం 223కు చేరుతుంది. వార్డుకు రెండు చొప్పున 300 దవాఖానాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. వీటిని డబల్ బెడ్‌రూం ఇండ్లు ఉన్న ప్రాంతాల్లో ఏర్పటుచేయనుంది. ఇందులో భాగంగా కాచిగూడ, పార్శీగుట్ట, కుత్బుల్లాపూర్, మలక్‌పేట్, కవాడిగూడ, దూల్‌పేట్, ఎర్రగడ్డ, నేరేడ్‌మెట్, మల్కాజిగిరి, సూరూర్‌నగర్, కార్వాన్‌లో వీటిని ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు మంత్రి తెలిపినారు.