కరీంనగర్,(ఆరోగ్యజ్యోతి):ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కలను శుక్రవారం నాడు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ చేతులమీదుగా పంపిణీ చేశారు. వివిధ రకాల అనారోగ్య కారణంతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్న 28 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరైన పది లక్షల విలువ చేసే చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయనిధి కింద ఇప్పటి వరకు ఎందరో మందికి పంపిణీ చేయడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.