శీతాకాలం పండుగా పరిగణించే సీతాఫలం పోషకాల సమాహారం. కొన్ని రకాల అనారోగ్యాల నివారణి. మరెన్నో సుగుణాలున్న ఈ పండు గురించి వివరింగా తెలుసుకుందాం. ఈ కాలంలో మూడు నెలలకు పైగా లభిస్తుంది సీతాఫలం. ఈ పండు రామాఫలం, లక్ష్మణఫలం రకాల్లోనూ దొరుకుతుంది. చూడడానికి ఒకే విధంగా ఉన్నా.. రుచి, వాసనలో కాస్త తేడా ఉంటుంది. సీజన్ వస్తోందంటే చాలు... కొన్ని పండ్ల రుచి పదే పదే గుర్తొచ్చేస్తుంటుంది. మహ్మద్ కలీముల్లా. ఆరోగ్యకార్యకర్త (మగ), పట్టణ మలేరియాపథకం నల్లగొండ. సీతాఫలం గురించి అనేక రకాల వివరాలను మనముందు ఉంచుతున్నారు
- ఈ సీజన్‌లో మనకు లభించే అనేక రకాల పండ్లలో సీతాఫలం కూడా ఒకటి. అత్యంత తియ్యని రుచిని కలిగి ఉండడమే కాదు, ఈ పండ్లను తినడం వల్ల మనకు ఎన్నో రకాల పోషకాలు కూడా లభిస్తాయి.
- సీజనల్ ఫ్రూట్‌గా మనకు లభించే సీతాఫలంలో విటమిన్ ఎ, మెగ్నిషియం, పొటాషియం, ఫైబర్, విటమిన్ బి6, కాల్షియం, విటమిన్ సి, ఐరన్ వంటి అత్యంత ముఖ్యమైన పోషకాలు ఎన్నో ఉన్నాయి.
- వీటిని ఈ కాలంలో ఎక్కువగా తినడం వల్ల మనకు అనేక రకాల లాభాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
- సీతాఫలాన్ని ఉదయాన్నే అల్పాహారంగా తీసుకుంటే దాంతో కండరాలు, నరాల బలహీనతలు తొలగిపోతాయి. శరీరానికి కావల్సిన శక్తి లభిస్తుంది.
- పోషకాలు: 100గ్రా. గుజ్జు నుంచి 94 క్యాలరీల శక్తి, 20-25గ్రా. పిండిపదార్థాలు, 2.5గ్రా. ప్రొటీన్లు, 4.4గ్రా. పీచూ లభ్యమవుతాయి. ఇంకా కెరోటిన్, థైమీన్, రిబోఫ్లేవిన్, నియాసిన్, విటమిన్-సి వంటి విటమిన్లు కూడా సమృద్ధిగా లభిస్తాయి.
- మలబద్ధకంతో బాధపడేవారికి ఈ పండు దివ్యౌషధంలా పనిచేస్తుంది.
- రోజూ తినగలిగితే.. ఎంతో మార్పు కనిపిస్తుంది.
- హృద్రోగులు, కండరాలు, నరాల బలహీనత ఉన్నవారు.. దీన్ని అల్పాహారంగా తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది.
- డైటింగ్ నియమాలు పాటించే వారు సైతం ఈ ఫలాన్ని నిరభ్యంతరంగా స్వీకరించవచ్చు. * పండులోని సల్ఫర్ చర్మవ్యాధుల్నీ తగ్గిస్తుంది
- . సీతాఫలం గుజ్జు శరీరంలోని క్రిములు, వ్యర్థపదార్థాలను వెలుపలికి పంపించి వేస్తుంది. పండే కాదు..
- ఒక్క సీతాఫలం పండే కాదు.. ఆకులు ఉపయోగపడతాయి. ఆకుల్లోని హైడ్రోస్తెనిక్ ఆమ్లం చర్మసంబంధ సమస్యల్ని తగ్గిస్తుంది. ఆకుల్ని మెత్తగా నూరి.. కాస్త పసుపు కలిపి.. మానని గాయాలు, గజ్జి, తామర ఉన్న చోట పూతగా రాస్తే సరిపోతుంది.
- ఆకుల్ని మెత్తగా నూరి బోరిక్ పౌడర్ కలిపి మంచం, కుర్చీల మూలల్లో ఉంచితే.. నల్లుల బెడద ఉండదు.
- సీతాఫలం బెరడును కాచగా వచ్చిన కషాయాన్ని అధిక విరేచనాలతో బాధపడేవారికి ఔషధంగా ఇస్తుంటారు.
- సీతాఫలం గింజల్ని పొడిచేసి తలకు రాసుకుంటే పేల సమస్య ఉండదు. అయితే కళ్లల్లో పడకుండా చూసుకోవాలి.
- గర్భిణులు ఈ పండును సాధ్యమైంత తక్కువగా తినాలి. పొరబాటున గింజలు లోపలికి పోతే గర్భస్రావం అయ్యే ప్రమాదముంది.
- విటమిన్ ఎ ఎక్కువగా ఉండడం వల్ల కంటి రోగాలు తొలగిపోతాయి. దృష్టి సమస్యలు దూరమవుతాయి.
- సీతాఫలంలో ఉండే మెగ్నిషియం గుండె జబ్బులు రాకుండా చూస్తుంది. వీటిలో ఉండే పోషకాలు శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తాయి.
- సీతాఫలాన్ని రోజూ తింటుంటే కడుపులో ఉండే నులిపురుగు చనిపోతాయి. అల్సర్లు నయమవుతాయి. గ్యాస్, అసిడిటీ, అజీర్ణం, మలబద్దకం వంటి జీర్ణ సంబంధ సమస్యలు తగ్గుతాయి.
- రక్తం తక్కువగా ఉన్న వారు సీతాఫలాలను తినడం మంచిది. దీంతో రక్తం తయారవుతుంది.
- శరీరంలో బాగా వేడి ఉన్న వారు సీతాఫలాలను తింటే వెంటనే వేడి నుంచి ఉపశమనం లభిస్తుంది.
- చిన్నారులు, బాలింత తల్లులకు సీతాఫలం చక్కని పోషకాలను అందిస్తుంది. వారికి తగిన శక్తి లభిస్తుంది.
- ఎదుగుతున్న పిల్లలు నిత్యం సీతాఫలాన్ని తింటుంటే దాంతో కాల్షియం వంటి పోషకాలు ఎక్కువగా లభిస్తాయి. దీని వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి.
- శరీరంలో ఉన్న వ్యర్థ పదార్థాలను బయటికి పంపించడంలో సీతాఫలం బాగా ఉపయోగపడుతుంది. రక్తం శుద్ధి కూడా అవుతుంది.
- మదుమేహం (షుగర్ వ్యాధి) ఉన్న వారు సీతాఫలం తీనకూడదు.