చలికాలం వ్యాధులపై అప్రమత్తం








 







  • ఆదిలాబాద్‌ జిల్లాలో వైద్య శిబిరాలు

  • కరోనాపై విస్తృతంగా అవగాహన

  • మలేరియా, డెంగీ, ఫ్లూ నివారణకు చర్యలు

  • పీహెచ్‌సీల్లో రోజుకు 50 ర్యాపిడ్‌ టెస్టులు


ఆదిలాబాద్‌, (ఆరోగ్యజ్యోతి) : జిల్లాలో వర్షాకాలంలో వ్యా ధుల నివారణకు అధికారులు తీసుకున్న చర్యలు సత్ఫలితాలు ఇచ్చాయి. జూలై నుంచి సెప్టెంబరు వరకు మూడు నెలల పాటు గ్రామాల్లో ర్యాపిడ్‌ ఫీవర్‌ సర్వే నిర్వహించారు. వైద్య సిబ్బంది ఇంటింటికీ తిరుగుతూ కుటుంబంలో ఎవరైనా వ్యాధులతో బాధపడుతున్నారా.. ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నాయా.. అని వివరాలు సేకరించారు. బాధితులకు తక్షణ వైద్యసేవలు అందించడంతో పాటు పరిస్థితి  తీవ్రంగా ఉన్నవారిని ఆదిలాబాద్‌ రిమ్స్‌కు తరలించారు. ఫలితంగా జిల్లాలో వానకాలంలో మలేరియా, డయేరి యా, టైఫాయిడ్‌ లాంటి వ్యాధుల ప్రభావం కనపడలేదు. ర్యాపిడ్‌ ఫీవర్‌ సర్వేలో భాగంగా వైద్యాధికారులు, సిబ్బంది వాగులు, వంకలు దాటుకుంటూ గ్రామాలతో పాటు ఏజెన్సీలోని ఆదివాసీ గూడేలు, తండాల ప్రజలకు మెరుగైన  సే వలు అందించారు. 


వానకాలం వ్యాధులపై దృష్టి.. 


జిల్లాలో వానకాలంలో మలేరియా, డెంగీ, ఫ్లూ లాంటి వ్యా ధులు ప్రబలే ప్రమాదం ఉంది. దీంతో పాటు కరోనా రెండో దశకు చేరుకుంటుందనే హెచ్చరికల నేపథ్యంలో వైద్యశాఖ అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఇందుకు సంబంధించి డీఎంహెచ్‌వో నరేందర్‌ రాథోడ్‌ ప్రాథమిక ఆ రోగ్య కేంద్రాల వైద్యులు, సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసి వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై సలహాలు, సూచనలు ఇచ్చారు. ప్రభావిత గ్రామాల్లో  వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రణాళికలు రూపొందించారు. రెండ్రోజులుగా జిల్లావ్యాప్తంగా శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. కరోనాపై సైతం ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. లక్ష మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 4107 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 3890 మంది కొవిడ్‌-19  నుంచి కోలుకున్నారు. అక్టోబర్‌లో జిల్లాలో కరోనా కే సుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ప్రస్తుతం 179 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కరోనా నివారణలో భాగంగా ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోజుకు  50 ర్యాపిడ్‌ పరీక్షలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పీహెచ్‌సీల్లో చలికాలం వచ్చే వ్యాధులతో పాటు కరోనా హోం ఐసొలేషన్‌ కిట్లు అందుబాటులో ఉన్నాయని వైద్యాధికారులు తెలిపారు.


ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం


జిల్లాలో చలికాలంలో ఫ్లూ, డెంగీ, మలేరియా వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. దీంతో పాటు కరోనా  నివారణకు తీసుకోవా ల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. ప్రభావిత గ్రామాల్లో శిబిరాలు ఏర్పాటు చేసి బాధితులకు వై ద్యసేవలు అందిస్తున్నాం. ప్రతి పీహెచ్‌సీలో రోజుకు 50 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని నిర్ణయించాం.


 - నరేందర్‌ రాథోడ్‌, జిల్లా వైద్యాధికారి